బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : బుధవారం, 12 డిశెంబరు 2018 (10:01 IST)

బీజేపీ నేత కిషన్ రెడ్డిని ఓడించిన నోటా ఓట్లు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో అనేక మంది సీనియర్ నేతలు ఓడిపోయారు. అలాంటి వారిలో బీజేపీ నేత కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈయన హెదరాబాద్ అంబర్ పేట నుంచి బరిలోకి దిగారు. ఈయన అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. 
 
తెరాస అభ్యర్థి కాలేరు వెంకటేశం 61558 ఓట్లు రాగా, కిషన్ రెడ్డికి 60542 ఓట్లు వచ్చాయి. అటే వీరిద్దరి మధ్య ఓట్ల తేడా కేవలం 1016 మాత్రమే. అదేసమయంలో నోటాకు పడిన ఓట్లు 1462. కేవలం నోటా ఓట్ల కారణంగానే కిషన్ రెడ్డి ఓడిపోయారు. 
 
ఇకపోతే, ఖమ్మం జిల్లా వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థి రాములు 52,650 ఓట్లతో గెలుపొందారు. రెండో స్థానంలో నిలిచిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోత్‌ మదన్‌లాల్‌ 50,637 ఓటు సాధించారు. మెజార్టీ కేవలం 2,013 ఉండగా నోటాకు 2,360 ఓట్లు పోలయ్యాయి. 
 
అలాగే, తుంగతుర్తి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గ్యాదరి కిశోర్‌కుమార్‌ 199ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ నోటా సంఖ్య 1,175. ఇలా పలువురు అభ్యర్థులను నోటా ఓడించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.