శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : శుక్రవారం, 23 నవంబరు 2018 (12:29 IST)

ఓటరుకు రెండు చేతులు లేకుంటే.. సిరా మార్కు ఎక్కడ వేస్తారు?

ఓటు హక్కు వినియోగించుకున్నట్టుగా నిర్ధారించేది ఎడమచేతి చూపుడు వేలిపై వేసే సిరా గుర్తు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఈ ఇంకు గుర్తు వేస్తారు. ఒక వేళ సిరా గుర్తు లేకపోతే ఏ వేలికి వేస్తారనే ధర్మ సందేహం చాలా మందికి వస్తుంది.
 
ఎడమచేతికి వేసే గుర్తు అంత త్వరగా పోదు. మరోమారు ఓటు వేయకుండా చూసేందుకే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ ఎవరికైనా చూపుడు వేలు లేకుంటే ఏం చేయాలన్న పరిస్థితిపై ఎన్నికల సంఘం కొన్ని నియమాలు, నిబంధనలు తయారు చేసింది. 
 
చూపుడు వేలు లేకుంటే మధ్యవేలికి సిరా గుర్తు వేయొచ్చు. ఒకవేళ అదీకూడా లేకుంటే ఉంగరపు వేలికి వేస్తారు. అదీకూడా లేకుంటే చిటికెన వేలికి అదీ లేకుంటే బొటనవేలికి వేస్తారు. ఒకవేళ ఎడమచేయంటూ లేకపోతే ఇదే నిబంధనను కుడిచేతికి పాటిస్తారు. అసలు రెండు చేతులే లేకుంటే భుజాలపై అవికూడా లేకుంటే ఎడమ చెంపపై వేయాలని ఎన్నికల నిబంధన సూచిస్తోంది. ఈ ఇంకు మార్కు విధానాన్ని 1962లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఉపయోగించారు.