శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : బుధవారం, 5 డిశెంబరు 2018 (13:30 IST)

తీవ్ర వ్యతిరేకత ఉంది.. బాబును వదులుకోవద్దని చెప్పా : లగడపాటి

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల పోలింగ్ ఈనెల 7వ తేదీన జరుగనుంది. ఈ పోలింగ్‌కు ముందు ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించిన సర్వే కలకలం రేపుతోంది. దీనిపై తెరాస నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంతా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు‌లు మండిపడుతున్నారు. లగడపాటిని ఓ పొలిటికల్ జోకర్‌గా అభివర్ణించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడితో లగడపాటి కుట్రపూరితంగా సర్వే ఫలితాలను వెల్లడించారని కేటీఆర్ ఆరోపించారు. 
 
దీనికి లగడపాటి బుధవారం వివరణ ఇచ్చారు. కేటీఆర్‌కు పంపిన సర్వే ఇప్పటిది కాదన్నారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, జనసమితి విడివిడిగా పోటీ చేస్తున్నప్పుడు చేసిన సర్వేని కేటీఆర్‌కు పంపినట్టు చెప్పారు. తనకు పదవులు, హోదాలు ముఖ్యం కాదని, వ్యక్తిత్వమే ప్రధానమన్నారు. పొరపాటునో, అవసరానికో మాట్లాడే రకం కాదన్నారు. తాను ఎవరి ఒత్తిడితోనో సర్వే ఫలితాలు మార్చానని అనడం సరికాదన్నారు. 
 
సెప్టెంబర్ 15, 16న కేటీఆర్ తనను కలిశారని, తన సాయం కోరారని లగడపాటి తెలిపారు. సర్వే రిపోర్ట్‌ను మెయిల్ చేసినట్టుగా 17న కేటీఆర్‌కు మెసేజ్ పంపానని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ విడివిడిగా పోటీ చేస్తున్నప్పుడు చేసిన సర్వే అది అని వివరించారు. నవంబర్ 11వ తేదీ నాటికి 37 స్థానాల్లో సర్వే చేశామన్నారు. 
 
అప్పటికే 65 శాతం ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, అభ్యర్థులను మార్చుకోకుంటే ఇబ్బంది ఉంటుందని కేటీఆర్‌కు చెప్పానని లగడపాటి వివరించారు. ఆ నాలుగు పార్టీలు కలిస్తే పోటాపోటీ ఉంటుందని కూడా చెప్పానన్నారు. కేటీఆరే స్వయంగా తన వద్దకు వచ్చి అడిగితేనే సర్వే వివరాలు వెల్లడించానినీ, ఏ ఒక్కరినీ ఛాలెంజ్ చేయలేదన్నారు. 
 
* కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ విడివిడిగా పోటీ చేస్తున్నప్పుడు చేసిన సర్వే అది.
* ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 12 వరకు సర్వే చేశాం.
* 65 శాతం ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని కేటీఆర్‌కు చెప్పా.
* అభ్యర్థులను మార్చుకోకుంటే ఇబ్బంది ఉంటుందని వివరించా.
* వాళ్లందరూ కలిస్తే పోటీ పోటాపోటీగా ఉంటుందని చెప్పా.
* 23 సెగ్మెంట్‌లలో పరిస్థితి ఎలా ఉందో కేటీఆర్ తెలుసుకోమన్నారు.
* నవంబర్ 11న 37 సెగ్మెంట్‌లలో పరిస్థితి ఎలా ఉందో రిపోర్ట్ ఇచ్చా.
* 37 సెగ్మెంట్‌లలో కాంగ్రెస్‌కు మెజార్టీ వస్తుందని చెప్పా.
* చేదు నిజం పంపిస్తే కేటీఆర్‌కు నచ్చలేదు.
* తాజా సర్వే ప్రకారం వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. 
* చంద్రబాబును వదులుకోవద్దు అని చెప్పా. 
* సింగిల్‌గానే కొట్టాలని కేటీఆర్ తనతో చెప్పారు.
* గజ్వేల్‌లో ఎవరు గెలుస్తారో 11వ తేదీన వెల్లడిస్తా.
* పోతారు సార్ అని తెలంగాణా పోలీసులే చెప్పారు.