శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Modified: బుధవారం, 5 డిశెంబరు 2018 (22:28 IST)

లగడపాటి సతీమణి మెడలో టీఆర్ఎస్ కండువా...

తెలంగాణ మహాకూటమికి సానుకూల వాతావరణం ఉందని చెప్పేందుకు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తీవ్రంగా శ్రమిస్తున్నారని టీఆర్ఎస్ అగ్ర నేతలు ఓ వైపు విమర్శిస్తుంటే ఆయన భార్య లగడపాటి పద్మ మాత్రం గులాబీ కండువా కప్పుకుని ఖైరతాబాద్‌లో దానం నాగేందర్‌కు అనుకూలంగా ప్రచారం చేశారు. 
 
దానం సతీమణి అనిత, ఇతర కుటుంబ సభ్యులతో ఇంటింటా ప్రచారం చేస్తున్న లగడపాటి సతీమణి మీడియాతో మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా ఐదేళ్లలో అన్ని పనులు పూర్తి చేయలేదన్నారు. కనీసం పదేళ్లు అవకాశం ఇస్తే పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయన్నారు లగడపాటి పద్మ. 
 
తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని తాను కూడా టీఆర్ఎస్ పార్టీ  గెలవాలని కోరుకుంటున్నానని లగడపాటి పద్మ వివరించారు. దానం నాగేందర్, లగడపాటి రాజగోపాల్ మధ్య బంధుత్వం ఉండటమే లగడపాటి సతీమణి పద్మ ప్రచారం చేయడానికి ప్రధాన కారణంగా తెలియవస్తోంది.