అధికారంలోకి వచ్చేది మేమే... తెరాస చీఫ్ కేసీఆర్

kcrao
Last Modified శుక్రవారం, 7 డిశెంబరు 2018 (13:00 IST)
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు. తమ స్వగ్రామం చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు కేసీఆర్ దంపతులు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్... రాష్ట్రవ్యాప్తంగా చాలా అనుకూలమైన పవనాలు ఉన్నాయన్నారు.

మేం మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం... తొలి నుంచి మంచి వాతావరణమే ఉందన్న ఆయన... మంచి ఫలితాలు రాబోతున్నాయన్నారు. పోలింగ్ శాతం కూడా భారీగా నమోదు కాబోతుందన్న టీఆర్ఎస్ అధినేత... హైదరాబాద్‌లో కూడా మంచి పోలింగ్ శాతం నమోదవుతోందని... ముఖ్యంగా వయోవృద్ధులు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారని చెప్పారు.



దీనిపై మరింత చదవండి :