తెలంగాణ వ్యాప్తంగా ‘నోటా’కు పోలైన ఓట్లు ఎన్నో తెలుసా?

nota symbol
Last Modified మంగళవారం, 11 డిశెంబరు 2018 (22:47 IST)
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ విజయం వైపు దూసుకుపోయింది. ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీలు కూడా అత్యల్ప సీట్లకు పరిమితం అయ్యాయి. అయితే నోటా(నన్ ఆఫ్ ది ఎబోవ్)కి ఎన్ని ఓట్లు పోలయ్యాయన్న దానిపై విద్యావంతుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పుడున్న రాజకీయ నేతలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలు, వాళ్లు చేస్తున్న అవినీతి కార్యక్రమాలు, వారికి పాలనాపరమైన అవగాహన లేకపోవడం, పెరుగుతున్న నిరుద్యోగ సమ్యస.. అనేవి యువతలో వ్యతిరేకతను పెంచుతున్నాయి.

ఈ నేపథ్యంలో నోటాకు పోలయ్యే ఓట్ల సంఖ్య పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో కూడా నోటాకు కీలకంగా ఓట్లు పోలయ్యాయి. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో.. అత్యధిక స్థానాల్లో నోటాకు వెయ్యికి పైగా ఓట్లు పోలయ్యాయి. వర్ధన్నపేట నియోజకవర్గంలో అత్యధికంగా 5864(సాయంత్రం 4 గంటల వరకు) ఓట్లు నోటాకు వచ్చాయి. అలాగే ఖమ్మం, ములుగు నియోజకవర్గాల్లో జాతీయపార్టీ బీజేపీ అభ్యర్థుల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు రావడం విశేషం.

ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ ప్రకారం సాయంత్రం 4 గంటల వరకు తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో నోటాకు పోలైన ఓట్లు ఇవీ..


అచ్చంపేట-1485,

ఆదిలాబాద్-1110
,
ఆలేరు-1120,

అలంపూర్-3399,

అంబర్‌పేట్-1372,

ఆందోల్-803,

ఆర్మూర్-1657
,
ఆసీఫాబాద్-2602
,
అశ్వరావుపేట-588,

బహుదూర్‌పుర-1210,

బాల్కొండ-593,

బాన్సువాడ-1549,

బెల్లంపల్లి-1943,

భద్రాచలం-2077
,
భువనగరి-1336,

భూపాలపల్లి-1360,

బోథ్-2275,

బోధన్-1611,

చాంద్రాయణగుట్ట-180
,
చార్మినార్-603
,
చెన్నూరు-1726
,
చేవెళ్ల-1223,

చొప్పదండి-2220,

దేవరకొండ-1695,

దేవరకద్ర-2413,

ధర్మపురి-2452,

డోర్నకల్-1962,

దుబ్బాక-879
,
గద్వాల్-1285,

గజ్వేల్-1546,

స్టేషన్‌ఘన్‌పూర్-462,

గోషామహల్-643,

హుస్నాబాద్-3519,

హుజురాబాద్-2867,

హుజుర్‌నగర్-615,

ఇబ్రహీంపట్నం-630,

జడ్చెర్ల-1034,

జగిత్యాల-1710,

జనగాం-2503
,
జూబ్లీహిల్స్-1090,

జుక్కల్-1976,

కల్వకుర్తి-885,

కామారెడ్డి-1471
,
కరీంనగర్-897,

కార్వాన్-663
,
ఖైరతాబాద్-1314(32 మంది అభ్యర్థుల్లో నోటాకు ఐదో స్థానం)
,
ఖమ్మం-3484(బీజేపీ కంటే ఎక్కువ),

ఖానాపూర్-2418,

కోదాడ-456
,
కొడంగల్-1287,

కొల్లాపూర్-1170,

కోరుట్ల-2476,

కొత్తగూడెం-1086,

కూకట్‌పల్లి-1288,

ఎల్బీనగర్-1121
,
మధిర-963,

మహబూబాబాద్-3156,

మహబూబ్‌నగర్-1275,

మహేశ్వరం-1731
,
మక్తల్-2001,

మలక్‌పేట్-498,

మల్కాజిగిరి-1630,

మానకొండూరు-2561,

మంచిర్యాల-620,

మంథని-2083
,
మెదక్-2125,

మేడ్చల్-3399,

మిర్యాలగూడ-27,

ముదోల్-2058
,
ములుగు-3248(బీజేపీ కంటే సగం ఎక్కువ),

మునుగోడు-3071,

ముషీరాబాద్-1320,

నాగార్జునసాగర్-1320,

నాగర్‌కర్నూలు-906
,
నకిరేకల్-1314,

నల్గొండ-1201,

నాంపల్లి-470,

నారయణ్‌ఖేడ్-416,

నారాయణపేట్-1813,

నర్సంపేట్-2436,

నర్సాపూర్-1580
,
నిర్మల్-1367
,
నిజామాబాద్ రూరల్-910
,
నిజామాబాద్ అర్బన్-562,

పాలేరు-1271,

పాలకుర్తి-822,

పరిగి-89,

పరకాల-2064
,
పటాన్‌చెరు-1334,

పెద్దపల్లి-1801
,
పినపాక-868,

కుత్బుల్లాపూర్-2220,

రాజేంద్రనగర్-1265,

రామగుండం-1078
,
సనత్‌నగర్-1464,

సంగారెడ్డి-1390,

సత్తుపల్లి-1664
,
సికింద్రాబాద్-1571
,
సికింద్రాబాద్- కంటోన్మెంట్-1471,

శేరిలింగంపల్లి-1504,

షాద్‌నగర్-1909,

సిద్దిపేట-2932
,
సిరిసిల్ల-2321,

సిర్పూర్-1579,

సూర్యాపేట-572
,
తాండూర్-787
,
తుంగతుర్తి-910,

ఉప్పల్-2333,

వేములవాడ-1729,

వికారాబాద్-1511
,
వనపర్తి-2014,

వరంగల్ తూర్పు-2612
,
వరంగల్ పశ్చిమం-3075,

వర్ధన్నపేట-5864(నోటాకు ఐదో స్థానం)
,
వైరా-2331
యాకుత్‌పుర-773,

ఇల్లందు-1910
,
ఎల్లారెడ్డి-2218,

జహీరాబాద్-1714.దీనిపై మరింత చదవండి :