శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కేసీఆర్
Written By CVR
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (16:45 IST)

టీలో విజృంభించిన స్వైన్ ఫ్లూ... 509 మందికి నిర్ధారణ..!

తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి విజృంభించింది. ఇప్పటి వరకు మొత్తం 1398 మందికి స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా, వారికి జరిపిన పరీక్షల్లో 509 మందికి స్వైన్ ఫ్లూ సేకినట్లు వైద్యులు నిర్ధారణ చేశారు. ఈ విషయం గురింతి రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోజు రోజుకు స్వైన్ ఫ్లూ భారినపడే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడి 23 మంది మృతిచెందారన్నారు. 
 
ఒక్క బుధవారం రోజు మాత్రమే 101 మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో 42 మందికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. ఎవరికైనా జ్వరంతో కూడిన జలుబు, ఒళ్లు నొప్పులు ఉన్నట్లైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని వారు సూచించారు. అంతేకాకుండా స్వైన్ ఫ్లూ నివారణకు హోమియో మందులను కూడా వాడవచ్చని వారు రోగులకు సూచించారు.