గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 డిశెంబరు 2023 (13:30 IST)

ఎలుక కాటుకు 40 రోజుల చిన్నారి మృతి

deadbody
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఎలుక కాటుకు 40 రోజుల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, పట్టణంలోని నాగనూల్ గ్రామానికి చెందిన లక్ష్మీకళ, పెద్ద కార్పాముల గ్రామానికి చెందిన శివ దంపతులకు 40 రోజుల క్రితం మగశిశువు జన్మించాడు. అప్పటి నుంచి లక్ష్మికళ ఇంటిపట్టునే ఉంటూ తన బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటూ వస్తుంది. 
 
అయితే, శనివారం రాత్రి నేలపై పడుకున్న లక్ష్మి... తన పక్కలోనే బిడ్డను పండబెట్టుకుంది. అయితే, అర్థరాత్రి సమయంలో ఆ పసికందును ఎలుక కొరకడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఆలస్యంగా ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు పసికందును ఆగమేఘాలపై ఆస్పత్రికి
తీసుకెళ్లి నీలోఫర్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశాడు. 
 
కన్నబిడ్డ మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికులు కూడా విచారణ వ్యక్తం చేస్తున్నారు. పైగా, ఎలుక కరవడం వల్ల చిన్నారి ప్రాణాలు కోల్పోవడమాన్ని ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు.