సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 ఏప్రియల్ 2024 (20:46 IST)

కాసాని జ్ఞానేశ్వర్‌ గెలుపు.. బీసీల అభివృద్ధికి మలుపు.. కేసీఆర్

kcrao
ఓ కాంగ్రెస్ పెద్దమనిషి మాట్లాడుతూ మీ బీసీలకు దమ్ముంటే, బీసీలకు పౌరుషం ఉంటే కాసాని జ్ఞానేశ్వర్‌ని గెలిపించి చూపియ్యండి అన్నాడు. ఇక్కడున్న బలహీనవర్గాల మేధావులకు , విద్యార్థులకు, ఉద్యోగులకు మనవి చేస్తున్నా. కాసాని జ్ఞానేశ్వర్‌ గెలుపు, బీసీల అభివృద్ధికి మలుపు కాబట్టి కాసానిని గెలిపించండి.. అంటూ తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు నిచ్చారు. 
 
ఇప్పుడు ప్రజల చేతిలోకి ఒక అంకుశం కావాలని.. ఒక హంటర్‌ కావాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి పనిచేయించే అంకుశం అవసరం ఇప్పుడు ఉందని పేర్కొన్నారు. అలాంటి అంకుశంలో ఓ పదునైన మొనదేలినటువంటి అంకుశం చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ అని ఆయన పేర్కొన్నారు. 
 
చేవెళ్లలో శనివారం నిర్వహించిన ప్రజాశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం మెడలు వంచి మీ పనులు చేయించాలంటే తెలంగాణలోని అన్ని ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్‌ గెలవాల్సిన అవసరం ఉందని తెలిపారు.