గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 డిశెంబరు 2024 (11:20 IST)

అంబులెన్స్‌ను చోరీ చేసిన దొంగ... ఎలా పట్టుకున్నారంటే (Video)

ambulance
ఓ దొంగ అంబులెన్స్‌ను చోరీ (హైజాక్) చేసి హల్చల్ సృష్టించాడు. అంబులెన్స్‌తో పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు పోలీసులు పడరాన్ని పాట్లుపడాల్సి వచ్చింది. చివరకు రోడ్డుకు అడ్డంగా లారీలను పెట్టి అంబులెన్స్‌ను ఆపి... ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు. 
 
తెలంగాణ రాష్ట్రంలోని హయత్ నగర్‌లో 108 వాహనం చోరి చేసిన ఖమ్మం వైపు వెళ్లిన దొంగ... చిట్యాల వద్ద అంబులెన్స్‌ను ఆపేందుకు ఎస్ఐ జాన్ రెడ్డి ప్రయత్నం చేశాడు. కొర్లపహాడ్ టోల్ ప్లాజాను దొంగ ఢీకొట్టాడు. టేకుమట్ల స్టేజ్ వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టి అంబులెన్స్‌ను కేతేపల్లి ఎస్ఐ శివతేజ ఆపారు. ఆ తర్వాత దొంగను అదుపులోకి తీసుకున్నారు.