గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (15:50 IST)

దూలంలా పెరిగాడు, దూడకున్న బుద్ధి వుండాలె: హరీశ్ రావుపై రేవంత్ పంచ్ డైలాగ్స్

revanthreddy
తెలంగాణలో రైతు రుణమాఫీ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి-భారాసకి మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఆగస్టు 15వ తేదీ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ రూ.2 లక్షలు చేస్తే తను రాజీనామా చేస్తానంటూ హరీశ్ రావు సవాల్ విసిరారు. ఈ సవాలును తాము స్వీకరిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
 
సభలో మాట్లాడుతూ... హరీశ్ రావు దూలంలాగా పెరిగాడు కానీ దూడకున్న తెలివి కూడా లేదు. ఆయన మెదడు మోకాలు లోనుంచి అరికాలికి పోయింది. ఆగస్టు 15 లోపల మా ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తది. దీనితో సిద్దిపేటకు నీ శని వదిలిపోతుంది.
 
రాజీనామా పత్రం రెడీ చేసుకో హరీశ్ అంటే సీస పద్యం రాసుకుని వచ్చాడు. అందులో మేము చెప్పనవి కూడా పెట్టిండు. అవన్నీ రాసి స్పీకర్ కి ఇస్తే రాజీనామా ఆమోదం జరగతదా. రాజీనామా చేయాలంటే స్పీకర్ ఫార్మెట్లో పత్రం వుండాలె. ఐనా మీరు దోచుకున్న లక్ష కోట్ల కంటే రైతు రుణమాఫీ డబ్బు ఎక్కువేం కాదులే అంటూ విమర్శించారు.