శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Updated : ఆదివారం, 4 అక్టోబరు 2020 (12:52 IST)

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం వజ్రాలు స్వాధీనం

హైదరాబాద్ శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టుబడింది. దాదాపు 21 కిలోల బంగారంతో పాటు, 30 కోట్ల విలువైన వజ్రాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ముంబైకి తరలించేందుకు స్మగ్లర్లు ప్రయత్నిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. 
 
ముంబైకి తరలించేందుకు స్మగ్లర్ పన్నిన పన్నాగాన్ని పసిగట్టిన కస్టమ్స్ అధికారుల బృందం ఎయిర్ పోర్టులో 5 గంటలుగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. భారీ ఎత్తున బంగారం డైమండ్ జ్యువలరీ ఆభరణాలు అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం అందడంతో ఎయిర్ కార్గోలో అధికారులను అలర్ట్ చేశారు. 
 
ఆ వెంటనే రంగంలోకి దిగిన కస్టమ్స్ అధికారులు.. డిప్యూటీ కమిషనర్ అధికారుల బృందం పెద్ద ఎత్తున బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. వజ్రా భరణాలు బంగారానికి పైనుండి వెండి పూత పూసి బంగారాన్ని గుర్తుపట్టకుండా అమర్చి తరలిస్తున్నారు స్మగ్లర్లు.