బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శనివారం, 12 సెప్టెంబరు 2020 (13:01 IST)

నా కోరిక తీర్చకపోతే నీ కుటుంబాన్ని భస్మం చేస్తా

బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో, తల్లి మరియు సోదరితో కలిసి నివాసం ఉంటున్న మైనర్ పైన కన్నేశాడు రమేష్ అనే 45 సంవత్సరాల కామాంధుడు. తండ్రి చనిపోయాడు, కుటుంబ భారం అంతా తల్లి మోస్తుండగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని నేను పూజలు చేస్తే మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మబలికాడు. 
 
నెమ్మదిగా తన ఉచ్చులోకి దింపాడు. రెండేళ్లుగా వాళ్ళింట్లో పూజలు నిర్వహిస్తున్న రమేష్, 2018లో ఎవరు లేని సమయంలో పూజ నిర్వహించడానికి వచ్చి మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇదిలా వుండగా ఇప్పుడు వాళ్ళ కుటుంబం కొంచెం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడటంతో నా పూజల వల్ల మీరు బయటపడ్డారంటూ మైనర్‌ని లోపర్చుకోవడానికి చూశాడు.
 
మైనర్ బాలిక ఒప్పుకోకపోవడంతో నేను పూజలు చేసి మీ తల్లిని, సోదరుని చంపేస్తానంటూ బెదిరించడంతో, మైనర్ తన తల్లికి విషయాన్ని చెప్పింది. విషయం తెలుసుకున్న తల్లి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సదరు కామాంధుడుపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.