Widgets Magazine

అక్క మొగుడితో అక్రమ సంబంధం.. బావతో భర్తను చంపేందుకు కుట్ర...

మంగళవారం, 12 జూన్ 2018 (21:35 IST)

Widgets Magazine

బావతో తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని పెళ్లయిన ఆరు నెలలకే భర్తను కడతేర్చాలని చూసింది ఓ ఇల్లాలు. తన అక్క భర్తతో కలిసి తాను కట్టుకున్న భర్తను హత్య చేసేందుకు పథకం వేసి పోలీసులకు చెక్కింది. యాదాద్రి జిల్లా లనుపాక గ్రామానికి చెందిన ఎంబరి పోషయ్య పెద్ద కూతురు గాయత్రికి విజయవాడకు చెందిన పత్తి శ్రీనుతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. దీంతో పోషయ్య చిన్నకూతురు అయిన జ్యోతి అప్పుడప్పుడు విజయవాడలోని అక్క ఇంటికి వెళ్లేది.
murder1
 
ఈ క్రమంలో తన బావ శ్రీనుతో ఆమెకు శారీరక సంబంధం ఏర్పడింది. ఆరు నెలల క్రితం జ్యోతికి రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లికి చెందిన గాజుల రాజుతో వివాహమైంది. అయినప్పటికీ తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని నీతో ఉంటానని జ్యోతి తన బావతో చెప్పేది. జ్యోతి తరచూ బావ శ్రీనుతో ఫోన్‌లో మాట్లాడేది. రాజుతో ఇంకా ఎన్నాళ్లు కాపురం చేయాలి, ఆయన్ని చంపు అని ఫోన్‌లో మాట్లాడింది. 
 
జ్యోతి కోరికపై రాజును ఎలాగైనా చంపాలని శ్రీను ప్లాన్‌ వేశాడు. ఈ నెల 3వ తేదీన పొలాల వద్ద రాజు గొర్రెలను మేపుతుండగా శ్రీను, మరొకరు నిందితుడు వెంకటదుర్గారావు, ఇద్దరూ రాజు ముఖంపై యాసిడ్‌ పోసి గొంతు నులిమి చంపేందుకు యత్నిస్తుండగా సమీపంలో ఉన్న గొర్రెల కాపరులు గుర్తించి కేకలు వేయడంతో పారిపోయారు. 
 
ఈ ఘటనలో గాయపడిన రాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల ఇంటికి చేరుకున్నాడు. పోలీసులకు అనుమానం వచ్చి జ్యోతిని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. జ్యోతి సెల్‌ఫోన్‌ కాల్‌డేటా, గ్రామంలోని సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా నిందితులను సులభంగా గుర్తించారు పోలీసులు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Affair Wife Plan Murder Sister's Husband Yadadri District

Loading comments ...

తెలుగు వార్తలు

news

మూడో రోజు టెట్‌కు 47,276 మంది అభ్య‌ర్థుల‌ హాజరు

అమరావతి: మూడో రోజూ అన్ని ప‌రీక్షా కేంద్రాల్లో ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష (టెట్) ప్ర‌శాంతంగా ...

news

గోదావరి తల్లికి జగన్ ప్రత్యేక పూజలు (వీడియో)

ప్రజాసంకల్ప యాత్ర 187వ రోజులో భాగంగా ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు బైపాస్‌ ...

news

సీఎం చంద్రబాబు నాయుడుపై అకస్మాత్తుగా పోసాని ఎందుకలా ఫైర్ అయినట్లు?

నటుడు, రచయిత పోసాని క్రిష్ణమురళి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ ...

news

వాజ్‌పేయికి డయాలసిస్... నిలకడగా ఆరోగ్యం... హెల్త్ బులిటెన్

భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్‌పేయి ఆరోగ్యం నిలకడగావుంది. ...