సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 మార్చి 2022 (12:37 IST)

వివాదానికి ఆజ్యం పోసిన చిన్నజీయర్ స్వామి - ఆందోళనలు

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్నజీయర్ స్వామి ఓ వివాదానికి ఆజ్యం పోశారు. సమ్మక్క సారలమ్మలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా మారాయి. దీంతో ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. 
 
వరంగల్ జిల్లా మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ఈ ఆందోళన తారాస్థాయికి చేరాయి. మరికొన్ని ప్రాంతాల్లో గత రెండు రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోనూ ఈ ఆందోళన జరుగుతున్నాయి.
 
సమ్మక్క, సారలమ్మలపై చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఆయనకు వ్యతిరేకంగా వివిధ రకాలైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ సమ్మక్క సారలమ్మ భక్తులు హెచ్చరిస్తున్నారు.