మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 మార్చి 2022 (09:10 IST)

జంట నగరాల్లో మందుబాబులకు షాక్ - 48 గంటలపాటు...

తెలంగాణ రాష్ట్రంలోని జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో మందుబాబులకు ప్రభుత్వం షాకిచ్చింది. మొత్తం 48 గంటల పాటు ఆంక్షలు విధించారు. హోళీ వేడుకలను పురస్కరించుకుని పండుగ రోజున మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్లులు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులతో పాటు బార్లు, క్లబ్బులు మూతపడనున్నాయి. 
 
అలాగే, హోళీ సంబరాల్లో భాగంగా అపరిచిత వ్యక్తులు, వాహనాలు, భవనాలపై రంగులు పోయడం చేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశాలు జారీచేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని స్టార్ హోటళ్లు, క్లబ్‌లు మినహా రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్‌లు గురువారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు మూసివేయాలని సూచించారు.