ప్రాణాలు తీసిన ఐపీఎల్ బెట్టింగ్...

suicide
శ్రీ| Last Modified బుధవారం, 15 మే 2019 (14:26 IST)
ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారం హైదరాబాద్‌లో ఓ యువకుడి ప్రాణాలు తీసింది. యువతకు క్రికెట్ మీద ఉన్న క్రేజ్, ఇంట్రెస్ట్‌ను కొందరు బెట్టింగ్ రాయుళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. బెట్టింగ్ సరదాతో పాటు డబ్బులు కూడా వస్తాయని ఆశపడ్డ కొందరు కాలేజ్ కుర్రాళ్లు ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు.

హైదరాబాద్ తుర్కయాంజల్‌కు చెందిన అఖిల్ క్రికెట్ బెట్టింగ్‌లో రూ. 15,000 పొగుట్టుకున్నాడు. స్నేహితుల దగ్గర 10 వేలు అప్పుచేసి అఖిల్ చెల్లించాడు. మిగిలిన 5,000 చెల్లించాలని బెట్టింగ్ రాయుళ్లు ఒత్తిడి చేసి అఖిల్ ఫోన్ లాక్కున్నారు. ఈ విషయం తెలిసిన ఇంట్లో తండ్రి మందలించడంతో మనస్థాపం చెందిన అఖిల్, ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. క్రికెట్ బెట్టింగ్‌లు అధికమవడంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వేటాడుతున్నా పలువురు బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.దీనిపై మరింత చదవండి :