టోల్‌ప్లాజా వద్ద నిందితుడి పోలికలతో ఉన్న వ్యక్తి..? రాజు అతడేనా?
హైదరాబాద్ నగరంలోని సింగరేణి కాలనీకి చెందిన చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి హతమార్చిన కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఎవరు గుర్తుపట్టకుండా ఉండటానికి నిందితుడు మారు వేషాలతొ తిరిగే అవకాశం ఉన్నందున, జుత్తు, గడ్డం వంటి మార్పులతో నిందితుని పోలి ఉండే చిత్రాలను విడుదల చేశారు. నిందితుడు రాజుని పట్టిస్తే పదిలక్షల రివార్డును కూడా ప్రకటించింది హైదరాబాద్ పోలీస్.
టెక్నికల్‌గా సీసీటీవీలను కనెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు పోలీసులు. ఇప్పటికే బస్టాండ్స్, రైల్వే స్టేషన్లలో చెకింగ్‌ను ముమ్మరం చేశారు. ఎల్బీనగర్‌కు కనెక్ట్ అయ్యే అన్ని హైవేలను జల్లెడపడుతున్నారు.
వరంగల్ హైవే, విజయవాడ హైవే, సాగర్, శ్రీశైలం హైవేల్లో గాలింపు చేపట్టారు. అయితే, ఇదే క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం పంతంగి టోల్ ఫ్లాజాను దాటుకుంటూ నిందితుడు వెళ్లినట్లు సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యింది.
అచ్చం నిందితుడి పోలికలతో కూడిన వ్యక్తి జాతీయ రహదారి వెంబడి నడుచుకుంటూ వెళ్తున్నట్లు సీసీ ఫుటేజ్‌ల్లో కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.