బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : సోమవారం, 13 నవంబరు 2017 (09:15 IST)

#OsmaniaUniHYD ‏: ఆలుగడ్డ కర్రీలో జెర్రి...

హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో మహిళల హాస్టల్ మెస్‌లో తయారు చేసే వంటకాల్లో జెర్రులు, బల్లులు కనిపిస్తున్నాయి. తాజాగా ఈ మెస్‌లో వండిన ఆలుగడ్డ కర్రీలో జెర్రి ఉంది. దీన్ని గమనించిన విద్యార్థినిలు ఆందోళనకు

హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో మహిళల హాస్టల్ మెస్‌లో తయారు చేసే వంటకాల్లో జెర్రులు, బల్లులు కనిపిస్తున్నాయి. తాజాగా ఈ మెస్‌లో వండిన ఆలుగడ్డ కర్రీలో జెర్రి ఉంది. దీన్ని గమనించిన విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. హాస్టల్‌లో బాత్రూంలు, నీటి సరఫరా సరిగా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో పాములు, జెర్రులు తిరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
వెంటనే కేర్‌టేకర్లు, లేడీస్ హాస్టల్ డైరెక్టర్లను విధుల నుంచి తప్పించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రోడ్డుపై బైఠాయించిన విద్యార్థినులు మధ్యాహ్నం వరకు రోడ్డుపైనే బైఠాయించడంతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు.
 
బంగారు తెలంగాణాను తయారు చేస్తున్నామంటూ ప్రగల్భాలు పలుకులున్న పాలకులు.. హాస్టల్స్‌, మెస్‌లలో ఎలాంటి ఆహారాన్ని వడ్డిస్తున్నారో ఓసారి వచ్చి పరిశీలించాలని విద్యార్థినిలు డిమాండ్ చేస్తున్నారు.