Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లక్ష్మీ పార్వతికి కేతిరెడ్డి వార్నింగ్... ఆమె నిజస్వరూపం బయటపెడతాం

ఆదివారం, 12 నవంబరు 2017 (15:07 IST)

Widgets Magazine
ketireddy

స్వర్గీయ ఎన్.టి.రామారావు రెండో భార్య లక్ష్మీ పార్వతికి ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ చిత్ర దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తాను నిర్మించతలపెట్టిన ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ చిత్రం షూటింగ్ సజావుగా సాగేందుకు లక్ష్మీ పార్వతి సహకరించాలని ఆయన కోరారు. లేనిపక్షంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాలకు వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేయించి, ఆమె నిజస్వరూపం బయటపెడతామని హెచ్చరించారు. తానేమీ లక్ష్మీ పార్వతి బయోపిక్ తీస్తానని ఎక్కడా చెప్పలేదని, దానిపై లక్ష్మీ పార్వతికి అభ్యంతరం ఏంటని అడిగారు.
 
‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ సినిమా షూటింగ్‌‌ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో గల ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈ సినిమా షూటింగ్ ‌చిత్రయూనిట్ ఆరంభించింది. అయితే, ఈ షూటింగ్‌కు తొలి రోజే అడ్డంకి ఎదురైంది. చిత్రయూనిట్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద సినిమా చిత్రీకరణకు అనుమతి లేదని వారు అభ్యంతరం తెలిపారు. దీంతో తాను అనుమతి తీసుకున్నానంటూ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. కాగా, అనుమతి పత్రంలో సినిమా పేరు, దానికి సంబంధించిన వివరాలు లేవంటూ షూటింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. 
 
ఈ సందర్భంగా దర్శకుడు కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ ఆత్మప్రబోధం మేరకు సినిమా తీసున్నామన్నారు. తమ సినిమాకు లక్ష్మీ పార్వతి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని సూచించారు. లేని పక్షంలో ఆమె నిజస్వరూపం బయటపెడతామని హెచ్చరించారు. 
 
తాను 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమాను చంద్రబాబు కోణంలోంచి తీస్తున్నానని వివరించారు. తన సినిమా పూర్తయిన తర్వాత, అది చూసిన తర్వాత లక్ష్మీ పార్వతికి ఏవైనా అభ్యంతరాలు ఉంటే కోర్టులో చూసుకోవాలని సూచించారు. తాను కూడా కోర్టులోనే తేల్చుకుంటానని దర్శకుడు కేతిరెడ్డి తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హీరోలు రాజకీయాల్లోకి రావడం దేశానికి విపత్తు: ప్రకాశ్ రాజ్

తమిళ అగ్రహీరోలు కమల్ హాసన్, రజనీకాంత్‌లు రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ...

news

ఆ హీరోతో తొలి ముద్దు అనుభవం మరిచిపోలేను : మాజీ మిస్ ఉత్తరాఖండ్

తెలుగు చిత్రపరిశ్రమలో అచ్చతెలుగు ఆడపిల్లగా కనిపించే హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఒకరు. ...

news

నేడు రాముడ్ని కాదు.. హీరోయిన్లతో అఫైర్లు ఉన్నాయి : 'గరుడవేగ' హీరో

"పీఎస్వీ గరుడవేగ" చిత్రం విజయంమత్తులో ఉన్న హీరో డాక్టర్ రాజశేఖర్ ఓ సంచలన విషయాన్ని ...

news

నేను నా మతాన్ని కోల్పోతున్నాను : రణ్‌వీర్

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్, దీపికాలు నటించిన తాజా చిత్రం "పద్మావతి". సంజయ్ లీలా భన్సాలీ ...

Widgets Magazine