సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : శుక్రవారం, 21 డిశెంబరు 2018 (11:32 IST)

వణికిస్తున్న చలి... అదిలాబాద్‌లో 5 డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నాలుగైదు రోజుల నుంచి రాత్రి వేళలతో పాటు పగటి వేళల్లో అదే స్థాయి ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణాలోని ఆదిలాబాద్‌లో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో జిల్లా ప్రజలు చలి ధాటికి తట్టుకోలేకపోతున్నారు. 
 
చలి తీవ్రత కారణంగా ఇప్పటికే అక్కడి స్కూల్ వేళల్లో మార్పులు కూడా చేశారు. ఉత్తరభారతం నుంచి మరో రెండు రోజులు చలి గాలులు వీచే అవకాశం ఉండటంతో.. ఉష్ణోగ్రతలు ఏ క్షణానైనా పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు, మూడు డిగ్రీలు పడిపోయే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.