శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2017 (15:59 IST)

కంచ ఐలయ్యకు మావోయిస్టు అండ... రక్షణ కోరిన మాజీ ప్రొఫెసర్

"సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు" అంటూ పుస్తకం రాసి విమర్శలపాలైన దళిత రచయిత, మాజీ ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కమిటీ జగన్ పే

"సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు" అంటూ పుస్తకం రాసి విమర్శలపాలైన దళిత రచయిత, మాజీ ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కమిటీ జగన్ పేరుతో లేఖ విడుదల చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. 
 
సంఘపరివార్, బీజేపీ హత్యా రాజకీయాలను ఖండిస్తున్నామని, సంఘపరివార్ నేతృత్వంలోని బిజెపి బ్రహ్మణీయ హిందూ ఫాసిస్టు విధానాలను అమలు చేస్తోందన్నారు. అక్షరాన్ని నిషేధించాలనుకుకోవడం అత్యంత ప్రమాదకరమని, సీనియర్ మహిళా జర్నలిస్టు గౌరి లంకేష్ హత్య, ఐలయ్యపై దాడి అందులో భాగమేనన్నారు. ఐలయ్య పుస్తకంపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన అప్రజాస్వామికమని, అభ్యంతరాలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ఐలయ్యకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని జగన్ పిలుపునిచ్చారు. 
 
ఇదిలావుండగా, ఆర్యవైశ్యుల నుంచి తన ప్రాణాలకు హాని ఉందంటూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మకు మాజీ ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఫిర్యాదు చేశారు. తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ సందర్భంగా ఓ వినతిపత్రం సమర్పించారు. ఈ ఫిర్యాదుపై  డీజీపీ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. కంచ ఐలయ్య ఎక్కడికైనా వెళితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించినట్టు సమాచారం.
 
ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ, ‘ఇప్పటి వరకూ పోలీసులు బాగా సహకరించారు. నాకు నిరంతర రక్షణ కల్పించాలని డీజీపీని కోరాను. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్నవాడిని.. తెలంగాణ రాష్ట్రం వాడిని కనుక, సమస్యను నా ప్రభుత్వం దృష్టికి, పోలీస్ యంత్రాంగం దృష్టికి తీసుకురావడం నా బాధ్యత. సెప్టెంబర్ 5 నుండి నిన్నటి వరకు నాలుగు పెద్ద ఘటనలు జరిగాయి. ఆ పుస్తకం ఏంటో తెలియకుండా రోడ్ల మీద బడి ఒక మేధావి నాలుక కోస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్నారు.
 
అసలు, డీమోనిటైజేషనే చాలా పెద్ద సోషల్ స్మగ్లింగ్. దీనిపై చాలాసార్లు నేను వ్యాసాలు రాశాను’ అని చెప్పారు. ‘రాజకీయాల్లోకి వచ్చేందుకే కంచ ఐలయ్య ఇదంతా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి?’ అనే ప్రశ్నపై ఆయన స్పందిస్తూ, ‘నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎప్పుడో వచ్చేవాడిని, తెలంగాణ ఉద్యమ సయంలోనే వచ్చేవాడిని. నా గొంతులో ప్రాణముండగా రాజకీయ రంగంలోకి పోను. నాది సోషల్ రిఫార్మ్ అజెండా’ అని ఆయన ప్రకటించారు.