బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శనివారం, 3 మార్చి 2018 (15:23 IST)

''ఏంషి షార్...'' ఫుల్లుగా మందుకొట్టిన యువతులు.... ఏం చేశారో తెలుసా?

వీకెండ్‌లో పబ్బుల్లో ఫుల్లుగా మందుకొట్టిన యువతులు కారు స్టీరింగ్ పట్టి రోడ్డెక్కారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని ఆరు చోట్ల అర్థరాత్రి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు ట్రాఫిక్ పోలీసులు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లో తనిఖీలు నిర్వ

వీకెండ్‌లో పబ్బుల్లో ఫుల్లుగా మందుకొట్టిన యువతులు కారు స్టీరింగ్ పట్టి రోడ్డెక్కారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని ఆరు చోట్ల అర్థరాత్రి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు ట్రాఫిక్ పోలీసులు. జూబ్లీహిల్స్  రోడ్డు నెంబర్ 36లో  తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు తాగిన మత్తులో కారు నడుపుతున్న ఇద్దరు యువతులు చిక్కారు. చత్తీస్‌గడ్‌కు చెందిన డాక్టర్ సౌమ్య ఫుల్లుగా తాగిన మైకంలో కారు నడుపుతుండగా.. ఆమె కారును ఆపి బ్రీత్ ఎనలైజర్‌తో సౌమ్యని పరీక్షించారు. 
 
మద్యం మోతాదు 88 పాయింట్లు రావడంతో ఆమె కారును సీజ్ చేసి.. కేసు బుక్ చేశారు. సరూర్‌నగర్‌కు చెందిన ప్రశాంతి అనే మరో యువతి మద్యం తాగిన మత్తులో AP 29 BV 0227 కారు నడుపుతుండగా.. బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించారు. ప్రశాంతికి 88 పాయింట్ల మద్యం మోతాదు రావడంతో ఆమెపై కేసు నమోదు చేసి.. కారును సీజ్ చేశారు. తాగిన మైకంలో మందుబాబు నరేంద్రవర్మ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బల్వంతయ్య భుజాలపై చేతుల వేసి.. తూలిపడ్డాడు. 
 
మందుబాబులు గర్ల్ ఫ్రెండ్లతో కార్లలో షికార్లు కొడ్తూ పోలీసులకు పట్టుబడ్డారు. కార్లలోని మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో 99 మంది తాగుబోతు డ్రైవర్లపై కేసులు బుక్ చేసి.. 45 కార్లు, 54 బైకుల్ని సీజ్ చేశారు పోలీసులు.