శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : సోమవారం, 13 నవంబరు 2017 (15:54 IST)

కొత్త సంవత్సరం నుంచి రైతులందరికీ 24 గంటల కరెంట్ : కేసీఆర్

కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ 24 గంటల పాటు కరెంట్ సరఫరా చేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఆ రాష్ట్ర శాసనసభలో ప్రకటించారు. ఈ సందర్భంగా గత పాలకులు, ప్రభుత్వాలపై ఆయన మరోమారు వి

కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ 24 గంటల పాటు కరెంట్ సరఫరా చేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఆ రాష్ట్ర శాసనసభలో ప్రకటించారు. ఈ సందర్భంగా గత పాలకులు, ప్రభుత్వాలపై ఆయన మరోమారు విమర్శల వర్షం కురిపించారు. రైతులను పట్టించుకుంటే ఇంత నష్టం జరిగేది కాదన్నారు. రైతు సమన్వయ సమితుల అంశంపై చిన్నారెడ్డి మాటలకు తాను కరుగిపోయానన్నారు. 
 
ఆయన సభలో మీడియాతో మాట్లాడుతూ, రైతు సమితులు గురించి మాట్లాడుతున్న వాళ్లు.. వైఎస్ హాయంలో వేసిన ఆదర్శ రైతులను, ఇందిరమ్మ కమిటీల గురించి ఏమంటారని ప్రశ్నించారు. వీటన్నింటికి సాక్షిగానే కదా… రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు… వలసలు పోయారన్నారు. దాన్ని ఏమనాలని ప్రశ్నించారు? 
 
నేరపూరిత నిర్లక్ష్యం కాకపోతే ఏం కావాలి… వ్యవసాయినికి రెండు గంటల కూడా కరెంట్ ఉండేది కాదు… దశాబ్దాల కాంగ్రెస్, టీడీపీ పాలనలో రైతాంగం చిన్నాభిన్నమైంది. 45 వేల 600 చెరువుల్లో కనీసం నాలుగైన పూడిక తీశారా..? అన్నమో రామచంద్రా అంటూ రైతులు చనిపోతుంటే.. దాన్ని నేరపూరిత నిర్లక్ష్యంకాక మరేమనాలని ఆయన ప్రశ్నించారు. 
 
రైతు సమన్వయ సమితుల ఏర్పాటు అవసరం లేదన్న సండ్ర వెంకట వీరయ్య, చిన్నారెడ్డి ఒక్క విషయాన్ని గమనించాలని సీఎం సూచించారు. మార్కెట్ కమిటీలు, కో ఆపరేటివ్స్ సొసైటీలు ఉన్నాయి.. రైతు సమన్వయ సమితులు ఎందుకని వెంకట వీరయ్య ప్రశ్నిస్తున్నారు.. మరి టీడీపీ ప్రభుత్వం 2005లో రైతు మిత్ర బృందాలు ఎందుకు ఏర్పాటు చేశారని సీఎం ప్రశ్నించారు. 
 
2 లక్షల రైతు మిత్ర బృందాలు ఏర్పాటు చేసి రూ.350 కోట్లు ఖర్చు పెట్టారని సీఎం తెలిపారు. ఇక 2005లో 50 వేల మంది ఆదర్శ రైతులను ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. రూ.60 కోట్లు ఖర్చు చేసి.. ఆదర్శ రైతులుగా ఆటో డ్రైవర్లు, మెకానిక్‌లను నియమించారని సీఎం తెలిపారు.
 
వివక్ష వహించని మొదటి ప్రభుత్వం తమది. వందశాతం నిష్పక్షపాత వైఖరితో ముందుకు వెళ్తున్నామని సీఎం ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వంలో ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 3 కోట్లు ఇస్తున్నాం. మీరిచ్చిరా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు చెప్పండి ఎవరిది నేరపూరిత నిర్లక్ష్యం అని సీఎం అడిగారు.