సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శుక్రవారం, 5 జనవరి 2018 (17:54 IST)

గజల్ శ్రీనివాస్ వీడియోలను ఎందుకలా పంపారు? పోలీసులపై కోర్టు ఆగ్రహం

లైంగిక ఆరోపణల వ్యవహారంలో పూర్తిగా కూరుకుపోయిన గజల్ శ్రీనివాస్ బెయిల్ కోసం హైదరాబాద్ నాంపల్లి కోర్టులో పిటీషన్ పెట్టుకున్నారు. దీనిపై విచారించిన కోర్టు ఆయన పిటీషన్ తోసిపుచ్చింది. అలాగే ఈ కేసులో పోలీసులు అనుసరించిన విధానంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

కోర్టు అనుమతి లేకుండా గజల్ శ్రీనివాస్‌కు సంబంధించిన వీడియో సీడీలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఎలా పంపుతారంటూ నిలదీసింది. ఆ సీడీలను కోర్టుకు సమర్పించకుండా ఇలా ఎందుకు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే కేసులో ఏ2 నిందితురాలిగా ఉన్న పార్వతి పరారీ వున్నదంటూ పోలీసులు చెప్పడంపై అసహనం వ్యక్తం చేసింది. ఆమె టీవీల్లో ఇంటర్వ్యూలు ఇస్తుంటే పరారీలో వున్నారని ఎలా చెపుతున్నారంటూ ప్రశ్నించింది. మొత్తమ్మీద గజల్ శ్రీనివాస్ కేసు విషయంలో పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.