శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 అక్టోబరు 2020 (09:27 IST)

కొలిక్కివచ్చిన హేమంత్ హత్య కేసు.. ఇక ఫాస్ట్ కోర్టులో విచారణ!!

ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన హేమంత్ హత్య కేసు వ్యవహారం ఓ కొలిక్కివచ్చింది. ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ చేపట్టారు. ఇందులో మొత్తం 18 మంది నిందితులను విడతలవారీగా కష్టడీలోకి తీసుకుని విచారించారు. వీరు వెల్లడించిన విషయాలతో పాటు పోలీసులు కూడా కీలకమైన ఆధారాలు సేకరించారు. దీంతో ఈ కేసులో నిందితుల వద్ద పోలీసుల విచారణ పూర్తయింది. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కేసు విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సాగనుంది. అలాగే, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కేసులో చార్జిషీటును కూడా పక్షం రోజుల లోపు దాఖలు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 
 
కాగా, ఇంటీరియల్ డిజైనర్‌గా పని చేస్తూ వచ్చిన హేమంత్‌ అనే యువకుడు రెడ్డి కులానికి చెందిన అవంతి రెడ్డిని ప్రేమించాడు. ఈ పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదిరించి ప్రేమించిన యువతిని హేమంత్ ప్రేమపెళ్లి చేసుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని అవంతి తల్లిదండ్రులు, బంధువులు, కిరాయి హంతకులతో హత్య చేయించారు. ఈ కేసులోని నిందితుల్లో అవంతి తల్లిదండ్రులు, మేనమాన కీలక సూత్రధారులుగా ఉన్నారు.