Widgets Magazine

మొగుడినే కడతేర్చిన నర్సవ్వ ... తెలంగాణాలో మరో వివాహేతర హత్య

తెలంగాణ రాష్ట్రంలో మరో వివాహేతర హత్య జరిగింది. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనీ భర్తనే కడతేర్చింది. ఆమె ఘాతుకురాలి పేరు నర్సవ్వ. ఈ దారుణం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగింది. తాజాగా వెలుగు

narsavva
pnr| Last Updated: మంగళవారం, 9 జనవరి 2018 (10:47 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరో వివాహేతర హత్య జరిగింది. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనీ భర్తనే కడతేర్చింది. ఆమె ఘాతుకురాలి పేరు నర్సవ్వ. ఈ దారుణం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం ఘనపూర్‌కు చెందిన బండి నర్సవ్వ - బాలయ్య(40) అనే దంపతులు ఉన్నారు. అయితే, బాలయ్య ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి వచ్చేవాడు. గత 20 రోజుల క్రితం బాలయ్య స్వగ్రామానికి తిరిగొచ్చాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాజన్న దర్శనానికి వేములవాడకు చేరుకున్నారు.

ఈ దంపతులిద్దరూ స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆ రాత్రికి దేవాలయంలోనే నిద్రించాలని భావించారు. అయితే, ఉండేందుకు అద్దె గదులు దొరక్క పోవడంతో ఆలయ గుడిచెరువు సమీపంలోని పార్కింగ్ స్థలంలో నిద్రించారు. ఈ క్రమంలో అర్థరాత్రి దంపతుల మధ్య మాటామాట పెరిగి గొడవకు దారితీసింది.

బాలయ్య అతిగా మద్యం సేవించి ఉండటంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో భర్త గొంతును భార్య నర్సవ్వ కోసింది. దీంతో అతను అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని గమనించిన ఇతర భక్తులు పోలీసులకు సమాచారం చేరవేయగా, వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


దీనిపై మరింత చదవండి :