Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అక్రమ సంబంధం ప్రశ్నించిందనీ భార్యను కిడ్నాప్ చేసి చున్నీతో బిగించి చంపిన భర్త

శనివారం, 6 జనవరి 2018 (10:54 IST)

Widgets Magazine
murder 1

మరో అమ్మాయితో భర్త పెట్టుకున్న వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన భార్య దారుణ హత్యకు గురైంది. తన ఇద్దరు స్నేహితుల సాయంతో భార్యను భర్త కిడ్నాప్ చేసి ఆమె చున్నీని గొంతుకు బిగించి చంపేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లెందులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇల్లెందు పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన పులిగండ్ల మల్లయ్య దంపతుల ఏకైక కుమార్తె పద్మ(29)ను ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం తొడిసెలగూడేనికి చెందిన బండారి ప్రభాకర్‌కు 12 యేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. పద్మ.. ఖమ్మం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో టైపిస్టుగా పని చేస్తోంది. 
 
ఏ ఉద్యోగం లేకుండా జులాయిగా తిరిగే ప్రభాకర్‌ మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్య పద్మకు తెలియడంతో భర్తను నిలదీసింది. దీంతో పద్మను ప్రభాకర్‌ చితకబాదుతూ చిత్రహింసలకు గురిచేస్తూ వచ్చాడు. ఈ వేధింపులు భరించలేక పద్మ పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లి, అక్కడ నుంచే ఉద్యోగానికి వస్తూ వెళ్లేది.
 
ఈ పరిస్థితుల్లో గురువారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న పద్మను భర్త ప్రభాకర్‌ మరో ఇద్దరు మిత్రుల సాయంతో ఆటోలో కిడ్నాప్‌ చేసి ఆమె చున్నీతోనే గొంతుకు బిగించి హత్య చేశారు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని మొట్లగూడెం మార్గంలోని చెట్లపొదల్లో పడేశారు. ఈ విషయం తెలుసుకున్న పద్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభాకర్‌ శుక్రవారం పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కడుపు చేసి పెళ్లికి నో చెప్పాడు... ప్రియుడిని చితక్కొట్టిన మహిళ

తెలంగాణ రాష్ట్రంలో ఓ మహిళ ప్రేమికుడి చేతిలో మోసపోయింది. గర్భవతిని చేసి మోసం చేయడంతో ...

news

కళను నీచ కార్యక్రమాలకు వాడుకుంటారా..? శ్రీనివాస్‌ను కఠినంగా శిక్షించండి

కళను అడ్డం పెట్టుకుని నీచాతి నీచ కార్యక్రమాలకు పాల్పడిన ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్‌పై ...

news

ప్రియుడి సుఖం కోసమే బూస్ట్‌లో నిద్రమాత్రలు కలిపి భర్తను చంపేశా : జ్యోతి

ప్రియుడు ద్వారా శారీరకసుఖం పొందేందుకే కట్టుకున్న భర్తకు బూస్ట్‌లో నిద్రమాత్రలు కలిపి ...

news

ఆట కోసం గర్ల్స్‌ను అలా కూర్చోబెట్టారు.. చూసేందుకు జనాల క్యూ (వీడియో)

ఓ ఆటను చూసేందుకు ఆ దేశ వాసులు క్యూ కడుతున్నారు. దీనికి కారణం.. ఆ ఆటను ఆడుతున్న అమ్మాయిలను ...

Widgets Magazine