మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

పొరుగు రాష్ట్రాల అమ్మాయిలతో ఎంఐఎం నేత ఇంట్లో రేవ్ పార్టీ!

హైదరాబాద్ నగరంలోని చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కొందరు మజ్లిస్‌ పార్టీ నేతలు రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీ కోసం పొరుగు రాష్ట్రాల నుంచి అందమైన అమ్మాయిలను రప్పించారు. ఈ విషయం అనూహ్యంగా  బయటకుపొక్కింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బార్కాస్‌కు చెందిన మజ్లిస్‌ పార్టీ నాయకుడు పర్వేజ్‌కు గౌస్‌నగర్‌ ఉందాహిల్స్‌లో ఇంపీరియల్‌ ఫాం హౌజ్‌ ఉంది. 
 
కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన పర్వేజ్‌ తన స్నేహితులతో కలిసి ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను రప్పించి రేవ్‌ పార్టీ నిర్వహించాడు. వీరు విచ్చలవిడిగా నృత్యాలు చేస్తున్న వీడియో రెండు నెలల అనంతరం తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
సామాజిక మాధ్యమాలలో ఈ వీడియో వైరల్‌ కావడంతో ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్‌ మజీద్, చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్‌  రుద్ర భాస్కర్, అదనపు ఇన్‌స్పెక్టర్‌ కె.ఎన్‌.ప్రసాద్‌ వర్మలు ఫాంహౌజ్‌ను పరిశీలించారు. 
 
ఈ వీడియోను ఆధారంగా చేసుకొని పర్వేజ్‌తో పాటు వీడియోలో ముఖాలు గుర్తు పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ రుద్ర భాస్కర్‌ తెలిపారు.