సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 అక్టోబరు 2023 (19:17 IST)

కారుపై కూర్చుని ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమ జంట..

Car Couple
Car Couple
ఉత్తరాదిన రొమాన్స్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆ కల్చర్ కాస్త హైదరాబాద్ నగరానికి పాకింది. ఓ ప్రేమ జంట కారుపైకి చేరి బహిరంగ ముద్దులతో మజా పొందే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
కారుపై ఉండే సన్ రూఫ్ నుంచి బయటకు వచ్చిన జంట లిప్ కిస్‌లతో రెచ్చిపోయారు. వారు మద్యం మత్తులో ఇలా ప్రవర్తించి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై చోటుచేసుకుంది. 
 
ఈ తతంగాన్ని వెనుక కారులో వస్తున్న వారు ఫోన్‌లో చిత్రీకరించడంతో సామాజిక మాధ్యమాల్లోకి చేరింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ జంట చేష్టలను ఎక్కువ మంది తప్పుబడుతున్నారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.