శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2019 (17:09 IST)

సానా సతీశ్ కేసులో కీలక మలుపు: షబ్బీర్ అలీకి నోటీసులు

సానా సతీశ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈడీ అదుపులో ఉన్న అధికారులు ముఖ్య సమాచారాన్ని రాబడుతున్నారు. సానా సతీశ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ నోటీసులు జారీ చేయగా.. మరి కొంతమందికి నోటీసులు ఇచ్చేందుకు ఈడీ సిద్ధమవుతోంది.
 
ఈ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేత కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, ఖురేషి, సానా సతీశ్, రమేశ్, చాముండిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. సుఖేశ్ గుప్తాకు బెయిల్ కోసం మెయిన్ ఖురేషీ, సతీశ్, షబ్బీర్ అలీ మధ్యవర్తిత్వం నడిపినట్లు ఈడీకి సమాచారం అందింది.

సుఖేశ్‌ గుప్తాకు బెయిల్ కోసం సీబీఐ అధికారులతో సత్సంబంధాలున్న మొయిన్ ఖురేషీకి సానా సతీశ్ ద్వారా రూ.1.50 కోట్లు ముడుపులు మారినట్టు సమాచారం. ఈ ముగ్గురు ప్రముఖులు సీబీఐ కార్యాలయానికి కూడా వెళ్లినట్లుగా సమాచారం. ఈ కేసులో మరో ఇద్దరు ప్రముఖులకు కూడా నోటీసులు వెళ్లే అవకాశం ఉంది.