Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హైదరాబాద్‌కు ఇవాంకా.. కుక్కలకు విషంపెట్టి చంపుతున్న జీహెచ్ఎంసీ

బుధవారం, 22 నవంబరు 2017 (11:12 IST)

Widgets Magazine
street dogs

హైదరాబాద్ మహానగరంలో బిచ్చగాళ్లతో పాటు.. వీధి కుక్కలు కూడా మాయమయ్యాయి. ఈనెల 28వ తేదీ నుంచి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌ (హెచ్ఐసీసీ)లో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. 
 
ఈ సదస్సుకు 100 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా కూడా హాజరవుతున్నారు. ఈ సమ్మిట్‌కు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. అందులో భాగంగా జీహెచ్ఎంసీ క్లీన్ అప్ డ్రైవ్ చేపట్టింది. రోడ్లు, రంగులు, సుందరీకరణ ఒకేగానీ.. బిచ్చగాళ్లతో పాటు వీధి కుక్కలు కూడా మాయం కావడం గమనార్హం. 
 
మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ ఏరియాలోని వీధి కుక్కులు రెండు రోజులుగా కనిపించకుండా పోతున్నాయి. రాత్రులు పెద్ద పెద్ద వాహనాల్లో వస్తున్న సిబ్బంది.. వీధి కుక్క కనిపిస్తే చాలు ఎత్తుకెళిపోతున్నారు. ఇన్నాళ్లు వీధుల్లో గుంపులుగా తిరిగిన కుక్కలు ఇప్పుడు కనిపించకపోవటంతో స్థానికులు కూడా షాక్ అవుతున్నారు. చాలా వీధుల్లో కుక్కలు చనిపోయివున్నాయి. ఈ కుక్కలకు జీహెచ్ఎంసీ సిబ్బంది విషంపెట్టి చంపివుంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 
 
కాగా, ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని ఆలయాలు, మసీదులు, చర్చిల వద్ద భిక్షమెత్తుకునే బిచ్చగాళ్లను కూడా జీహెచ్ఎంసీ సిబ్బందితో పాటు.. పోలీసులు అదుపులోకి తీసుకుని చర్లపల్లి జైలు ప్రాంగణానికి తరలించిన విషయం తెల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భారత్‌పై పాకిస్థాన్‌ తీరు మారాల్సిందే: చైనా ఫైర్

భారత్‍పై పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలపై చైనా స్పందించింది. ప్రతి విషయంలోనూ భారత్‌పై ...

news

అద్దె చెల్లించాల్సిందే... లతా రజినీకాంత్‌కు చుక్కెదురు

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ విద్యా సంస్థలతో పాటు.. ఓ ట్రావెల్ ...

news

ఎందుకు బతికున్నావు.. చచ్చిపో... నారాయణ విద్యార్థినికి టీచర్ వేధింపులు

"నువ్వు కడుపునకు గడ్డితింటున్నావా? మట్టి తింటున్నావా? ఎందుకు బతికున్నావు.. చచ్చిపో! నా ...

news

జింబాబ్వేలో ముగాబే పాలనకు తెర... తెరవెనుక ఏం జరిగిందంటే..

జింబాబ్వేలో మూడున్నర దశాబ్దాలకు పైగా సాగిన రాబర్ట్ ముగాబే పాలనకు తెరపడింది. 93 యేళ్ళ ...

Widgets Magazine