28 నుంచి హైదరాబాద్ మెట్రో సేవలు ప్రారంభం

బుధవారం, 22 నవంబరు 2017 (09:30 IST)

Metro Rail

హైదరాబాద్ మహానగరంలో మెట్రో సేవలు ప్రారంభంకానున్నాయి. ఈనెల 28వ తేదీన హైదరాబాద్‌కు వచ్చే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సేవలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అంది. 
 
ఈనెల 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని మోడీ చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా అంటే 3 గంటల 25 నిమిషాలకు మియాపూర్ మెట్రో స్టేషన్ చేరుకొని… మెట్రో రైల్‌ను ప్రారంభిస్తారు. మియాపూర్ నుంచి కూకట్‌పల్లి వరకు 5 కిలోమీటర్లు రైలులో ఆయన ప్రయాణిస్తారు. తిరగి మియాపూర్ చేరుకుని.. అక్కడే ఏర్పాటు చేసే ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. 
 
మెట్రో ప్రారంభం తర్వాత హెలికాప్టర్‌లో హెచ్ఐసీసీ చేరుకుని, ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు రోడ్డుమార్గంలో ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసే విందుకు హాజరవుతారు. ఆ తర్వాత ఎనమిదిన్నరకు శంషాబాద్ నుంచి తిరిగి ఢిల్లీ వెళతారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భార్యతో అక్రమసంబంధం.. అడ్డుచెప్పిన భర్తను గొంతుకోసి హత్య...

దేశరాజధాని మరో దారుణం జరిగింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని మందలించిన ...

news

ఫోటో చూస్తే అమ్మాయి నచ్చలేదు.. ఉరేసుకున్న యువకుడు

అమ్మాయి నచ్చలేదని చెప్పినా వినిపించుకోకుండా.. అదే అమ్మాయితో వివాహం చేయించేందుకు ...

news

భార్య, కుమారుడిని పక్కనబెట్టి... దొంగలను హతమార్చిన సైనికుడు

హాలీడే ట్రిప్పును ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన సైనికుడు తన భార్య వద్ద కుమారుడిని అప్పగించి ...

news

ఆస్తి కోసం అన్న భార్యపై 9 నెలలుగా అత్యాచారం...

అన్న భార్య అంటే తల్లితో సమానం అంటారు. అలాంటి తల్లితో సమానమైన స్త్రీపై 9 నెలలుగా ...