Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డీసీపీ గంగిరెడ్డికి కాలితే ఇలానే ఉంటుంది... (వీడియో)

శనివారం, 23 డిశెంబరు 2017 (12:27 IST)

Widgets Magazine
gangireddy

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు గొప్పగా ప్రచారం చేస్తోంది. కానీ, నిందితుల పట్ల హైదరాబాద్ నగర పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుచూస్తే ప్రతి ఒక్కరూ విస్తుపోవాల్సిందే. ముఖ్యంగా, మాదాపూర్ అడిషినల్ డీసీపీ ర్యాంకులో ఉన్న పోలీసు ఉన్నతాధికారి గంగిరెడ్డి ఓ నిందితుడిపట్ల ప్రవర్తించినతీరు ఇపుడు తీవ్రవిమర్శలకు దారితీసింది. 
 
విచారణ నిమిత్తం నిందితుడిని స్టేషన్‌కు పిలిపించిన డీసీపీ గంగిరెడ్డి తన మార్క్ కౌన్సిలింగ్ ఇవ్వడంపై విమర్శలు చెలరేగాయి. డీసీపీ గంగిరెడ్డి ఇచ్చిన ట్రీట్మెంట్‌పై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫ్రెండ్లీ పోలిసింగ్ అంటే ఇదేనా అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. 
 
ఇంతకీ గంగిరెడ్డి తన మార్క్ కౌన్సింగ్ ఇచ్చింది ఎవరికో తెలుసా? టాలీవుడ్ షార్ట్ ఫిల్మ్ దర్శకుడు యోగికి. ఈయన నటి హారికను లైంగిక వేధింపులకు గురిచేసినట్టు ఆరోపణలు వచ్చాయి. వీటిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్శకుడు యోగిని స్టేషన్‌కు పిలిపించిన గంగిరెడ్డి తన మార్క్ కౌన్సిలింగ్ ఇచ్చారు. 
 
దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే.. ఇది ఒక్కసారిగా వైరల్ అయింది. నెటిజన్లు తెలంగాణ రాష్ట్ర హోం శాఖ అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంపై దుమ్మెత్తి పోస్తూ, తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రాజస్థాన్‌లో దారుణం : నదిలో పడిన బస్సు... 30 మంది జలసమాధి (వీడియో)

రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని దుబి ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం ...

news

ఉద్యోగమిప్పించి ప్రేమించాడు.. సహోద్యోగితో సన్నిహితంగా ఉండటంతో చంపేశాడు...

సికింద్రాబాద్‌లో ప్రేమోన్మాది చేతిలో పెట్రోల్ దాడికిగురై 80 శాతం కాలినగాయాలతో ...

news

గుజరాత్ సీఎం పోస్ట్ : విజయ్ రూపానీకి మరో ఛాన్స్...

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీతానై పార్టీని నడిపించిన ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి ...

news

దళిత మహిళ చీర లాగి.. రవిక చింపడం బాధించింది : పవన్ కళ్యాణ్

విశాఖపట్టణం జిల్లా పెందుర్తితో తన స్థలాన్ని కబ్జా చేయాలని భావించిన భూబకాసురలను అడ్డుకున్న ...

Widgets Magazine