మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2023 (11:37 IST)

లేడీస్ హాస్టల్‌లో మహిళ మృతి .. ఎందుకో తెలుసా?

deadbody
హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ లేడీస్ ప్రైవేట్ హాస్టల్‌లో ఒక మహిళ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె... మంగళవారం రాత్రి ప్రాణాలు విడిచారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, ఆస్పత్రికి తరలించారు. 
 
కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని 5వ రోడ్డులో అమృత అనే ప్రైవేట్ లేడీస్ హాస్టల్ ఉంది. ఈ హాస్టల్‌కు రెండు రోజుల క్రితం హాసిని ప్రియ (33) అనే మహిళ వచ్చి చేరింది. అక్కడ చేరిన తర్వాత ఆమె అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆమె తన స్నేహితుల సాయంతో తిరిగి హాస్టల్‌కు చేరుకున్నారు. 
 
అయితే, బుధవారం ఉదయానికి ఆమె మృతి చెందారు. మృతురాలిని నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన మహిళగా గుర్తించారు. మృతురాలు హైదరాబాద్ నగరంలో ఓ పబ్‌లో పనిచేస్తున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మృతదేహాన్ని గాందీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.