Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''ఇతడే నిజమైన బాహుబలి'' కేటీఆర్ ట్వీట్.. ఇంతకీ ఆయనెవరు?

ఆదివారం, 31 డిశెంబరు 2017 (18:55 IST)

Widgets Magazine

తమిళనాడులోని ఫారెస్ట్ గార్డు శరత్ కుమార్‌పై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. గుంటలో పడిపోయిన ఏనుగు పిల్లను రక్షించి దానిని తన తల్లి వద్దకు చేర్చిన శరత్ కుమార్‌ను ప్రశంసిస్తూ కేటీఆర్ తన ట్విట్టర్లో "ఇతడే నిజమైన బాహుబలి" అంటూ ట్వీట్ చేశారు. తిండిలేక నీరసించిపోయిన ఓ ఏనుగు పిల్ల గుంటలో పడిపోవడంతో దానిని కాపాడమంటూ ఏనుగు తల్లి ఆ రోడ్డుపైనే బైఠాయించింది. 
 
ఏనుగు పిల్లను కాపాడేందుకు ఫారెస్ట్ గార్డు తన సహచర ఉద్యోగులతో కలిసి శ్రమించి దానిని కాపాడారు. ఈ ఘటన హిల్ స్టేషన్ ఊటీకి యాభై కిలోమీటర్ల దూరంలో ఉండే మెట్టుపాళ్యంలో చోటుచేసుకుంది. రోడ్డుపైనే వున్న తల్లి ఏనుగును తరిమికొట్టినా అది అక్కడ నుండి కదల్లేదు. ఆపై  సహచర ఉద్యోగులతో కలిసి ఆ ప్రాంతంలో వెతికే సరికి.. చిన్న ఏనుగు పిల్ల గుంతలో పడి వుండటాన్ని గమనించామని శరత్ కుమార్ చెప్పారు. 
 
గుంతలో నుంచి దాన్ని రక్షించి.. వేరే మార్గం ద్వారా రోడ్డుపై వచ్చి.. దాని తల్లి వద్దకు వదిలిపెట్టాం. మరుసటి రోజు వెళ్లి చూస్తే ఆ రెండు ఏనుగులు  సురక్షితంగా అడవుల్లోకి వెళ్లినట్లు గల పాదాల గుర్తులు గమనించాం. నలుగురు కలసి ఆ  పిల్ల ఏనుగును మోసకొచ్చే ప్రయత్నం చేశామని శరత్ తెలిపారు.

ఒకవేళ తల్లి ఏనుగు కనుక దాడి చేస్తుందేమోననే భయపడ్డాం. కానీ తానొక్కడినే తన భుజాలపై మోశాను. తన సహచరులు బ్యాలెన్స్ కోల్పోకుండా తనకు సహకరించారు. అంత బరువున్న ఆ ఏనుగు పిల్లను ఎత్తిన ఫారెస్ట్ గార్డు దృశ్యాలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మదర్సాలో బాలికపై అత్యాచారం- వేధింపులు.. 51మంది బాలికలకు విముక్తి

దేశంలో మహిళలపై వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని నగరం ఢిల్లీ, ...

news

రజనీకాంత్ రాజకీయ ప్రకటన- ఫుల్ స్పీచ్ వీడియో- అమితాబ్ హర్షం

తమినాడులో తలైవా రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాల్లో వస్తున్నా... యుద్ధానికి అందరూ ...

news

ఎంజీఆర్, జయలలిత తర్వాత రజనీకాంతే: ఎమ్మెల్యే రోజా ప్రకటన

తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయాల నేపథ్యంలో రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన సూపర్ ...

news

తమిళనాడులో 234 నియోజకవర్గాల్లో పోటీ చేస్తా: రజనీకాంత్ ప్రకటన

తమిళనాట రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని సూపర్ స్టార్ రజనీకాంత్ తెలిపారు. కొన్ని రోజులుగా ...

Widgets Magazine