ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 అక్టోబరు 2023 (18:29 IST)

తెలంగాణాలో హస్తం హవా : ఇండియా టుడే సంచలన సర్వే

tselection congress
తెలంగాణ అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరుగనున్నాయి. నవంబరు 30వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో అధికార భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు పోటీ పడుతున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 54, బీఆర్ఎస్‌కు 49 చొప్పున సీట్లు వస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఇండియా టుడే ఒక సర్వే నిర్వహించి, ఆ ఫలితాలను వెల్లడించింది. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ సర్వే ఫలితాలను కొట్టిపారేస్తూ, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా 75 స్థానాలను గెలుచుకుంటుందని చెప్పారు. 
 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 54 సీట్లు, బీఆర్ఎస్‌కు 49 సీట్లు రావొచ్చని ఇండియా టు డే సర్వే తెలిపింది. బీజేపీకి ఎనిమిది, ఇతరులు ఎనిమిది చొప్పున సీట్లు గెలుచుకుంటారని తెలిపింది. అయితే, కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే 11 శాతం ఓటు బ్యాంకు పెరిగి 39 శాతానికి చేరుకుందని, అధికార భారత రాష్ట్ర సమితికి 9 శాతం ఓటు బ్యాంకు తగ్గి 38 శాతానికి చేరుకుందని, బీజేపీకి 7 శాతం నుంచి 9 శాతం ఓటు పెరిగి 16 శాతానికి చేరుకుందని సర్వే వెల్లడించింది. 
 
బీఆర్ఎస్‌కు 49 సీట్లు, మజ్లిస్‌కు 7 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, ఈ రెండు పార్టీలు గెలిచినప్పటికీ 56 సీట్లు మాత్రమే వస్తాయని, అపుడు బీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మరికొందరు ఎమ్మెల్యేలు అవసరం అవుతారని తెలిపింది. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికల్లో 75 సీట్లు గెలుచుకుంటామని ధీమావ్యక్తం చేస్తుంది.