శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2022 (18:39 IST)

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల-ఆదివారం కూడా..?

exams
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ వుంటాయని విద్యాశాఖ వెల్లడించింది. 
 
రెండు సెషన్స్‌లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆదివారం రోజుల్లో కూడా ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి.