Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అతిథి దేవోభవ: భాగ్యనగరంలో ఇవాంకకు ఘన స్వాగతం ( వీడియో)

మంగళవారం, 28 నవంబరు 2017 (08:36 IST)

Widgets Magazine
ivanka trump

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముద్దుల కుమార్తె, అమెరికా ప్రభుత్వ సలహాదారు ఇవాంకా ట్రాంప్ మంగళవారం భాగ్యనగరంలో అడుగుపెట్టారు. తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పోలీస్ ఉన్నతాధికారులు ఇవాంకకు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు.
 
ఆ తర్వాత విమానాశ్రయం నుంచి ప్రత్యేక వాహనంలో హై సెక్యూరిటీ కాన్వాయ్‌తో మాదాపూర్ ట్రైడెంట్ హోటల్‌కు చేరుకున్నారు. ఇవాంక రాకతో ఎయిర్ పోర్టుతో పాటు ఆమె వెళ్లనున్న రూట్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎయిర్ పోర్టులో సీఐడీ ఐజీ షికా గోయెల్  భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇవాంకతో పాటు సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన వీఐపీలు, వీవీఐపీలకు ప్రభుత్వం సాదరంగా ఆహ్వానిస్తోంది. వారిని భారీ భద్రత మధ్య సిటీలోని స్టార్ హోటళ్లకు తీసుకెళ్లారు.
 
ఇక ట్రైడెంట్ హోటల్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు హెచ్ఐసీసీకి చేరుకుంటారు. తర్వాత హెచ్ఐసీసీలోని రెండో అంతస్తులో భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో ఆమె భేటీ అవుతారు. మధ్యాహ్నం మియాపూర్లో మెట్రో రైలు ప్రారంభించిన తర్వాత ప్రధాని మోడీ హెలికాప్టర్లో హెచ్ఐసీసీకి చేరుకుంటారు. 
 
అక్కడ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సును ప్రారంభింస్తారు. రాత్రి 7.30కు పాతబస్తీలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్తారు. సదస్సుకు వచ్చిన 1500 మంది ప్రతినిధులు 45 బస్సుల్లో ఫలక్ నుమా ప్యాలెస్‌కు చేరుకోనున్నారు. అక్కడ అతిథులకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం విందు ఏర్పాట్లు చేసింది. బుధవారం రాత్రికి ఆమె దుబాయ్‌కు వెళతారు. 

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చంద్రబాబు సొంత నియోజకవర్గంలో రోజా - ఆ దమ్ముందా అంటూ సవాల్ (వీడియో)

ఎపి సిఎం చంద్రబాబునాయుడు ప్రజల నమ్మకాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నారని విమర్శించారు వైసిపి ...

news

ఇండో - పాక్‌ల మధ్య న్యూక్లియర్ వార్? పశ్చిమ దేశాల్లో టెన్షన్

దక్షిణాసియాలో అణ్వాయుధాలు కలిగిన దేశాల్లో చైనా, భారత్, పాకిస్థాన్‌లు ఉన్నాయి. అయితే, ...

news

న్యూజిలాండ్‌కు పెను సునామీల ముప్పు .. తప్పించుకునేందుకు 7 నిమిషాలేనట (వీడియో)

ప్రపంచంలో అత్యంత సుదరమైన పర్యాటక ప్రాంతాలు కలిగిన దేశం న్యూజిలాండ్. ఈ దేశానికి పెనుముప్పు ...

news

సింగపూర్‌కు ఏపీ రైతుల బృందం... ఎందుకు?

అమరావతి: సింగపూర్‌కు 34 మందితో కూడిన రెండో విడత రాజధాని ప్రాంత రైతుల బృందం సోమవారం ...

Widgets Magazine