1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 2 జూన్ 2020 (22:15 IST)

లాక్ డౌన్ ఇబ్బందులు: నూడిల్స్ బండి వ్యాపారి ఆత్మహత్య

లాక్ డౌన్ అమలుతో మూడు నెలలుగా జీవనోపాధి కోల్పోయిన గుంటూరు వెంగయ్య నగర్‌కు చెందిన షేక్ జాన్ బాబు  ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. లాక్ డౌన్ మూలంగా వ్యాపారం లేకపోవడంతో ఇంటి అవసరాలకు డబ్బులు లేవు. పైగా మూడు నెలల నుంచి ఇంటి అద్దె చెల్లించాలని జాన్ బాబుపై ఇంటి యజమాని వొత్తిడి చేయడంతో ఇల్లు ఖాళీ చేయాలని నిర్ణయించుకుని సామాన్లు సర్దుకున్నాడు జాన్ బాబు.
 
అయినా అద్దె చెల్లించాలంటూ జాన్ బాబుపై వేధింపులకు ఇంటి యజమాని పాల్పడటంతో భరించలేక ఇంట్లో ఉరి వేసుకుని జాన్ బాబు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి యజమాని మోహనరావు ఆయన బంధువుల వేధింపులు తాళ లేక  తాను ఆత్మహత్య చేసుకుంటుంన్నట్టు సూసైడ్ నోటు రాయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.