మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 నవంబరు 2020 (10:44 IST)

ప్రేమ విఫలం అయ్యిందని.. కూల్‌డ్రింక్స్‌లో పురుగుల మందును..?

ప్రేమ విఫలం అయ్యిందని.. పెళ్లికి పెద్దలు అంగీకరించరని భావించిన ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచి రేవుల గ్రామంలో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ ప్రాంతానికి చెందిన సపంత్, పార్వతిలు శనివారం సాయంత్రం నార్సింగ్‌లోని మంచిరేవుల ప్రాంతంలో కూల్‌డ్రింక్స్‌లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. 
 
అనంతరం తన స్నేహితుడికి సంపత్ ఫోన్ చేసి పురుగుల మందు తాగామని, తమను ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పాడు. వెంటనే స్నేహితుడు పోలీసుల సహాయంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రేమికులు మరణించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.