శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: గురువారం, 27 మే 2021 (19:04 IST)

పెళ్ళయి సంవత్సరమే, ప్రియుడి కోసం ఇంట్లో బంగారు, వెండి దొంగతనం

ప్రియుడితో కలిసి జీవించేందుకు కట్టుకున్న భర్త ఇంట్లోనే చోరీ చేసిన ప్రియురాలి ఉదంతాన్ని ఖమ్మం పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం ఏర్పరచుకుని ప్రియుడితో కలిసి జీవించేందుకు భర్త ఇంటి నుంచే బంగారు, వెండి నగలను దొంగిలించి నగదుగా మార్చేందుకు ప్రయత్నించారు. ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన భర్త, పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు చాకచక్యంగా వారి నుంచి 63 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.
 
ఖమ్మం నగరానికి చెందిన జ్యోతి అనే యువతికి అశోక్ అనే వ్యక్తితో సంవత్సరం క్రితమే వివాహమైంది. అయితే వివాహితకు వివాహానికి ముందే శివ అనే వ్యక్తితో సంబంధం ఉంది. వివాహమైన తరువాత కూడా రహస్యంగా ఇది కొనసాగుతూ వచ్చింది. అయితే పెళ్ళైన తరువాత ప్రియుడితోనే ఉండిపోవాలనుకుంది.
 
అందుకు డబ్బులు అవసరం కాగా భర్త ఇంటిలోనే స్కెచ్ వేసింది. ప్రియుడితో కలిసి ఇంటిలోని బంగారు, వెండి, ల్యాప్‌ట్యాప్‌లను దొంగిలించింది. ఏమీ ఎరుగనట్లు దొంగతనం జరిగినట్లు పోలీసులకు చెప్పింది. జ్యోతిపై అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితులను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు.