మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జెఎస్కె
Last Modified: శుక్రవారం, 6 ఆగస్టు 2021 (13:57 IST)

బంజారాహిల్స్‌లో మ‌సాజ్ పేరుతో అశ్లీల కార్య‌క‌లాపాలు

హైదాబాదులోని బంజారాహిల్స్‌లో మసాజ్ సెంటర్లో అశ్లీల కార్యకలాపాలు గుట్టు ర‌ట్ట‌య్యాయి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని ఓ మసాజ్ సెంటర్లో అమ్మాయిల‌తో మ‌సాజ్‌లు చేయిస్తూ, అశ్లీల కార్య‌క‌లాపాలు సాగిస్తున్నార‌ని పోలీసుల‌కు స‌మాచారం అందింది.

దీనితో ఓ మ‌సాజ్ సెంట‌ర్ పైన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు చేశారు. మసాజ్ పేరుతో అశ్లీల కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఆరుగురు అమ్మాయిలతో పాటు ఇద్దరు విటులను పోలీసులు అరెస్టు చేశారు.
 
ముందస్తు సమాచారం, నిఘా సహకారంతో ఈ దాడులు నిర్వహించారు పోలీసులు. మసాజ్ సెంటర్లో పని చేస్తూ అరెస్టయిన అమ్మాయిలంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారేనని పోలీసులు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ అమ్మాయిల చేత మసాజ్ సెంటర్ యజమానులు ఈ పాడు పనులు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి మ‌సాజ్ సెంట‌ర్ల‌కు వ‌చ్చే వారిని కూడా వ‌దిలిపెట్ట‌మ‌ని పోలీసులు పేర్కొన్నారు.