శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (13:02 IST)

రూ.105 కోట్ల ఘరానా మోసం.. ముంబైలో నిందితుల అరెస్ట్

రుణం పేరిట జరిగిన ఘరానా మోసంలో నిందితులు చిక్కారు. మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి నిర్మాణ సంస్థకు రూ.105 కోట్లను మోసం చేసిన కేసులో నిందితులు ముంబైలో అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. సోమాజీగూడలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రుణం కోసం యత్నాలు చేస్తుండగా, గత జూన్‌లో ఛాంపియన్ ఫిన్‌సెక్ కంపెనీ (సీఎఫ్ఎల్) ప్రతినిధులు హర్షవర్ధన్, బాలూభాయ్ పటేల్‌లు ఇందిరారెడ్డి సంప్రదించారు. 
 
బ్యాకింగేతర సంస్థల నుంచి రూ.11.50 కోట్ల రుణం ఇప్పిస్తామని చెప్పారు. రుణం మంజూరయ్యాక తమకు ఒక శాతం కమీషన్ ఇవ్వాలన్నారు. పూచీకత్తుగా నిర్మాణ సంస్థ షేర్లు తనఖా ఉంచాలని కోరారు. అంగీకరించిన ఇందిరా రెడ్డి 32.50 లక్షల షేర్లను సీఎఫఎల్ పేరుపై బదిలీ చేశారు.
 
రుణం అందకపోవడంతో హైదరాబాద్‌లోని సీఎఫ్ఎల్ పేరుపై బదిలీ చేశారు. రుణం అందకపోవడంతో హైదరాబాదులోని సీఎఫ్ఎల్ కార్యాలయానికి వెళ్లగా, హర్షవర్ధన్, బాలూభాయ్‌లు ఇద్దరూ లేరు. 
 
వీరిద్దరూ తమకు అప్పు ఇప్పిస్తామని చెప్పారని, ఇందుకు షేర్లను తనఖా వుంచుకుని వాటిని అమ్మి రూ.105 కోట్లు కాజేశారని సుబ్బరామిరెడ్డి సతీమణి ఇందిరారెడ్డి గత జులైలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రోసెసింగ్ రుసుం పేరుతో షేర్ల పత్రాలను కూడా తీసుకున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.