బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 డిశెంబరు 2021 (10:49 IST)

అపార్ట్‌మెంట్లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు

అపార్ట్‌మెంట్లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు బోయిన్‌పల్లి పోలీసులు. వివరాల్లోకి వెళితే... రాధాస్వామి కాలనీ రాక్‌ప్రైడ్‌ అపార్ట్‌మెంట్లో వ్యభిచార ముఠాను కనుగొన్నారు. అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నెంబర్  201లో పోలీసులు దాడి చేసి పోలీసులు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. 
 
వ్యభిచార గృహం నిర్వాహకుడు కుత్బాల్లాపూర్‌కు చెందిన ఎండీ అజీజ్, నిజాంపేటకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన విటుడు సుబ్రహ్మణ్యంతో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.4 వేల నగదు, మూడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.