ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 మే 2023 (10:12 IST)

సికింద్రాబాద్- నాగ్‌పూర్‌ల మధ్య వందేభారత్ రైలు

vande bharat express
సికింద్రాబాద్- నాగ్‌పూర్‌ల మధ్య వందేభారత్ సెమీ స్పీడ్ రైళ్లు ఇప్పటికే నడుస్తున్నాయి. త్వరలో హైదరాబాద్-నాగ్‌పూర్ మధ్య రైలును తీసుకురావాలని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే ఈ రెండు నగరాల మధ్య ఐదారుగంటల్లోనే ప్రయాణించే అవకాశం లభిస్తుంది. 
 
కాచిగూడ-పూణె, హైదరాబాద్-బెంగళూరు వంటి పట్టణాలకు వందేభారత్ రైళ్లు నడపాలన్న ప్రతిపాదనలు కూడా వున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్, హైదరాబాద్‌ విద్యావ్యాపార, ఐటీలకు కొలువులకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. 
 
దీంతో హైదరాబాద్ నుంచి వివిధ నగరాల నుంచి వెళ్లే ప్రయాణీకులు, వచ్చే ప్రయాణీకులను దృష్టిలో పెట్టుకుని వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచేందుకు రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.