గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2017 (09:26 IST)

రుతుపవనాలు బలహీనం.. తెలంగాణలో భారీ వర్షాలు లేవు..

మధ్యప్రదేశ్‌ నుంచి కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు భూతలంపై 900 మీటర్ల ఎత్తు వరకు ద్రోణి ఏర్పడింది. మరోవైపు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ నుంచి కర్ణాటకలోని ఉత్తర ప్రాంతాల వరకు ఉపరితల ఆవర్తనం 3.6 కిలోమీటర్ల

మధ్యప్రదేశ్‌ నుంచి కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు భూతలంపై 900 మీటర్ల ఎత్తు వరకు ద్రోణి ఏర్పడింది. మరోవైపు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ నుంచి కర్ణాటకలోని ఉత్తర ప్రాంతాల వరకు ఉపరితల ఆవర్తనం 3.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించింది. దీంతో తెలంగాణలో రుతుపవనాలు బలహీనంగా ఉన్నందున శనివారం నుంచి ఈ నెల 12 వరకు భారీ వర్షాలు పడే అవకాశాలు లేవని హైదరాబాద్ వాతావరణ అధికారి వై.కె.రెడ్డి చెప్పారు. 
 
అయితే అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లుల నుంచి ఒక మాదిరి వర్షాలు కురుస్తాయని తెలిపారు. కానీ భారీ వర్ష సూచన లేదన్నారు. గురు, శుక్రవారాల్లో అత్యధికంగా నారాయణపేటలో 7, మొగుళ్లపల్లిలో 6, ధర్మసాగర్‌, దామెరగిద్ద, భీర్కూర్‌, కోటగిరి, వికారాబాద్‌లలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసిందని రెడ్డి తెలిపారు. 
 
అయితే సెప్టెంబర్ ఆరు, ఏడు తేదీల్లో రాయ‌ల‌సీమ‌, తెలంగాణ ప్రాంతాల మీదుగా కొన‌సాగుతున్న‌ ఉప‌రిత‌ల ద్రోణి కారణంగా.. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసిన సంగతి తెలిసిందే.