గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2017 (09:54 IST)

కొండెక్కిన కూరగాయల ధరలు... చికెన్ ధరతో పోటీ...

కూరగాయల ధరలు కొండెక్కాయి. వీటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు కూరగాయల మార్కెట్‌కు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. కేవలం బయట మార్కెట్లోనే కాదు.. రైతు బజార్లలోనూ కూరగాయల ధరలు మండ

కూరగాయల ధరలు కొండెక్కాయి. వీటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు కూరగాయల మార్కెట్‌కు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. కేవలం బయట మార్కెట్లోనే కాదు.. రైతు బజార్లలోనూ కూరగాయల ధరలు మండిపోతున్నాయి. చికెన్‌, మటన్‌ ధరలతో పోటీపడుతున్నాయి.
 
టమాటా ధర ఏకంగా ఐదురెట్లు పెరిగింది. నెల కిందటకిలో టమాట రూ.11 ఉండగా ప్రస్తుతం రూ.50కు చేరుకుంది. బయట బండ్లపై ఏకంగా రూ.75 నుంచి రూ.80 వరకు పలుకుతూ సెంచరీ దిశగా పరుగు పెడుతోంది.
 
అలాగే కిలో రూ.25గా చిక్కుడు రూ.75 అయింది. రూ.30గా ఉన్న క్యారెట్‌ రూ.60కి, రూ.18గా ఉన్న దొండకాయ రూ.38కి, రూ.23గా ఉన్న వంకాయ రూ.60కి చేరింది. రూ.23 ఉన్న బెండకాయ రూ.38కి, రూ.13 ఉన్న పచ్చి మిర్చి రూ.40కి చేరింది. 
 
అయితే, కూరగాయల ధరలు ఒక్కసారిగా మరీ ఇంతలా పెరగడానికి ఇటీవల కురిసిన భారీ వర్షాలే కారణం అని అంటున్నారు. ముసురుకు పంటలన్నీ పూత, పిందె దశలోనే దెబ్బతిన్నాయి. ప్రధానంగా రంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టంవాటిల్లింది. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకోవాల్సి రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.