Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేడే 'రేవంత్ రెడ్డి' సినిమా విడుదల... ఢిల్లీలో 'రాహుల్ గాంధీ' రిలీజ్

మంగళవారం, 31 అక్టోబరు 2017 (13:12 IST)

Widgets Magazine
Rahul gandhi-Revanth

రేవంత్ రెడ్డి సినిమా విడుదల ఏంటి అనుకుంటున్నారా.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలన్నీ రేవంత్ రెడ్డి చుట్టూనే తిరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి 31వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. రేవంత్ రెడ్డి పార్టీ చేరికపై ఆ పార్టీ సీనియర్ నేతలు ఈరోజు సాయంత్రం ప్రత్యేకంగా సమావేశం కూడా కానున్నారు.
 
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా ఆయన కేసీఆర్ పైన విమర్శనాస్త్రాలను సరైన దిశలో సంధిస్తూ.. రానున్న ఎన్నికల్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళకలిగే ఒకే ఒక వ్యక్తిగా భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డిపై ఆశలు పెట్టుకున్నారు. ఢిల్లీకి వెళ్ళి ఏకంగా రాహుల్ గాంధీని కలిసిన తరువాత రేవంత్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను పార్టీ మారుతున్న విషయం ఎవరికీ తెలియకుండా టి.టిడిపి సమావేశాలకు హాజరవుతూ వచ్చారు రేవంత్. కానీ చివర్లో తెదేపాకు షాకిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
 
ఇదిలావుంటే తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి సీతక్క ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీకి షాకిచ్చారు. తెదేపా పదవులు, సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్లు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. మంగళవారంనాడు ఉదయం ఫ్యాక్స్‌లో లేఖను బాబుకు పంపారు. ఆమెతో పాటు మరికొందరు తెదేపా నాయకులు కూడా పార్టీకి రాజీనామాలు చేస్తున్నట్లు తెలిపారు. వీరంతా ఈరోజు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇంట్లో కట్టెల పొయ్యి వెలిగిస్తున్నారా? అయితే జాగ్రత్త సుమా

మనదేశంలో వాతావరణ కాలుష్యం అమాంతం పెరిగిపోతోంది. ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ, రసాయనాలతో ...

news

ఆధార్ దేశ భద్రతకు పెనుముప్పు... ప్రధాని మోదీతో చెప్తా...

ఆధార్ కార్డు నెంబరు లింక్ చేయనిదే బ్యాంకు లావాదేవీలు సైతం బ్లాక్ చేస్తామంటూ ఓవైపు ...

news

వరుసకు అన్నే ఆ పని చేశాడు.. టాయ్‌లెట్ కిటీకి నుంచి పసికందు గడ్డిపై పడింది...

మైనర్ బాలికలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ముంబై నగరంలో వరుసకు ...

news

సబ్‌మెరైన్లను ధ్వంసం చేసే యుద్ధ విమానాలు.. పాకిస్థాన్‌కు భారత్ చెక్ పెడుతుందా?

పాకిస్థాన్ చర్యలను ధీటుగా ఎదుర్కొనేందుకు భారత్ సమాయత్తమవుతోంది. భారత్ పట్ల దూకుడుగా ...

Widgets Magazine