గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 జులై 2021 (17:21 IST)

వీఆర్ఎస్ కోరిన సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈయనకు సర్వీసు మరో ఆరేళ్లు వుంది. అయితే, స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
పోలీసు శాఖలో పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని వెల్లడించారు. ఈ సందర్భంగా 26 ఏళ్లపాటు సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు. 
 
పదవీ విరమణపై ప్రభుత్వ కార్యదర్శికి లేఖ పంపినట్లు తెలిపారు. ప్రవీణ్‌కుమార్‌ 1995 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శిగా సేవలు అందించారు. 
 
1995 బ్యాచ్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్‌ ప్రస్తుతం అదనపు డీజీపీ హోదాలో సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా పని చేస్తున్న విషయం తెలిసిందే. ఆరు సంవత్సరాల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన వీఆర్‌ఎస్‌ కోరడం హాట్‌ టాపిక్‌గా మారింది.